షర్మిల రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన ‘బండి’.. రేవంత్ ఒప్పుకోగానే రంగంలోకి!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు శనివారం ఉదయం వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్ పీఎస్సీ లీకేజీ, నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేంది. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుదామని షర్మిల వారికి వివరించారు. ప్రగతి భవన్ మార్చ్‌కు పిలుపునిద్ధామని ఆమె వారితో చర్చించారు. కేసీఅర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని రేవంత్, బండితో మాట్లాడారు.
కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ బతకనివ్వరని వైఎస్ షర్మిల వారికి వివరించినట్లు లోటస్ పాండ్ వర్గీయులు స్పష్టంచేశారు. కాగా ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపినట్లు వైఎస్సార్ టీపీ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారని, పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారని లోటస్ పాండ్ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి: కేసీఆర్ హామీలు నమ్మే వారికి ఫూల్స్ డే శుభాకాంక్షలు!