'ఓ సారి వచ్చి చూస్తే తెలుస్తుంది!' హరీష్ రావు వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్

ఏపీలో తమ ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో అప్లై చేసుకోవాలని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Update: 2023-04-12 07:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా కార్మికులు ఏపీలో తమ ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో అప్లై చేసుకోవాలని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటికే పలు అంశాలపై బీఆర్ఎస్ వర్సెస్ వైసీపీ మధ్య వార్ సాగుతున్న వేళ హరీష్ రావు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రి హరీష్ రావుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రులు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, హరీష్ రావును ఏపీకి రావాలన్నారు.

హరీష్ రావు ఏపీలో ఒక్కసారి తొంగి చూస్తే ఇక్కడ ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతందో తెలుస్తుందన్నారు. ప్రతి ఇంట్లో జగన్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, ఇక్కడ అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసన్నారు. కాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతల మధ్య ఇలాంటి డైలాగ్ వార్స్ తరచూ జరుగుతున్నాయి. గతంలో మంత్రి కేటీఆర్ ఓ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో మౌళిక సదుపాయాలు అంతగా బాగోలేవని తన మిత్రుడే స్వయంగా ఈ విషయాన్ని తనతో చెప్పాడంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా హరీష్ రావు ఏపీ ఓటర్లు తెలంగాణలో నమోదు చేసుకోవాలని చెప్పిన మాటలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

Tags:    

Similar News