యాదగిరిగుట్టలో దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ్మ స్వామి కొండపైన కొలువైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.
దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ్మ స్వామి కొండపైన కొలువైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ అమ్మవారిని దర్శించుకుని పులకించారు. ప్రత్యేక పూజలు, కుంకుమార్చనల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రాతఃకాల పూజ అర్చనలు, పారాయణములు, గాయత్రీ జపములు, లలిత సహస్రనామార్చన, దుర్గాష్టమి పురస్కరించుకొని విశేషంగా చండీ హవనం నిర్వహించారు. మధ్యాహ్న పూజ నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వితరణ జరిపారు. సాయంకాలం శ్రీదేవీ నవావరణ పూజ, సహస్రనామార్చన, నీరాజనం, మంత్రపుష్పములు, దుర్గా స్వరూప సువాసినీ పూజ, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు అర్చక పండితులు వైభవంగా నిర్వహించారు.
Read More...
Basara: బాసర క్షేత్రంలో భక్తజన సందోహం.. ‘కాళరాత్రి దేవి’గా దర్శనమిచ్చిన అమ్మవారు