కూ.. చుక్ చుక్ పరుగులు! ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన పూర్తి! మన దగ్గరే

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇది ఎక్కడో కాదు జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మాణం జరిగింది.

Update: 2024-06-17 08:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇది ఎక్కడో కాదు జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మాణం జరిగింది. అతి త్వరలో సేవలు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసికి రైలు సర్వీస్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వంతెనపై మొదటి ట్రయల్ రన్ నిర్వహించారు.

చీనాబ్‌ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. అయతే, ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్‌ నదిపై 275 మీటర్లు ఎత్తులో ఉన్న షుబాయ్‌ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ బ్రిడ్జి బద్దలు కొట్టింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువే ఉంటుంది.

కాగా, త్వరలో ఇక్కడ రైల్వే సేవలు అందుబాటులోకి వస్తే కాశ్మీర్ అందాలు వీక్షించవచ్చు. ఈ క్రమంలోనే ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా నిలువనుందని తాజాగా రియాసి డిప్యూటీ కమిషనర్‌ విశేశ్‌ మహాజన్‌ అభివర్ణించారు. ఈ బ్రిడ్జి ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతోందన్నారు. ఇది గర్వించదగిన క్షణమని, ఈ కట్టడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వెల్లడించారు.

Tags:    

Similar News