Amala : కుక్కలను చంపడం కాదు.. వ్యాక్సినేషన్ వేయించాలి! అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

Update: 2024-09-28 09:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రేబిస్ వ్యాధి నివారణ, అవగాహన పెంచడానికి ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ వరల్డ్ రేబిస్ ప్రివెన్షన్ డే సందర్భంగా తాాజాగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రముఖ నటి, హైదరాబాద్ బ్లూ క్రాస్ సొసైటీ చైర్మన్ అక్కినేని అమల, సీడీఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌతమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని అమల మాట్లాడుతూ.. హైదారాబాద్‌లో ప్రతి ఏడాది పదివేల శునకాలకుపైగా స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ సహకారంతో రేబిస్ ఫ్రీ తెలంగాణ చేయడానికి అందరూ తమతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. 13 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 4 వేల కుక్కలకు రేబిస్ టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. రేబిస్ నివారణకు శునకాలను చంపడం ఒక్కటే మార్గం కాదు.. వాటికి వ్యాక్సినేషన్ వేయించాలని అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Similar News