రూల్స్ ప్రకారం పని చేయాలి.. ఎలాంటి ఒత్తిడికి తలోగ్గొద్దు
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాయిడ్ బృందాలు ఇతర సిబ్బంది భారత ఎన్నికల సంఘం ఆదేశాలు మార్గదర్శకాల ప్రకారమే పనిచేయాలి
దిశ, సిటీ బ్యూరో: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాయిడ్ బృందాలు ఇతర సిబ్బంది భారత ఎన్నికల సంఘం ఆదేశాలు మార్గదర్శకాల ప్రకారమే పనిచేయాలని.. ఎలాంటి ఒత్తిళ్లకు తలగొద్దని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. బంజారాహిల్స్ లోని బంజారా భవన్ లో బుధవారం ఎన్నికల సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రతి సిబ్బందికి భారత ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళితో కూడిన పుస్తకాలను పంపిణీ చేశారు. నామినేషన్లు మొదలుకొని కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు అధికారులు వ్యవహరించాల్సిన తీరు అందుకు సంబంధించిన నిబంధనలను జిల్లా ఎన్నికల అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు. ఈ కార్యక్రమంలో 15 నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటు జిల్లా ఎన్నికల ఉప అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కూడా పాల్గొన్నారు.