బస్సులో‌ మహిళకి ఫిట్స్.. నేరుగా ఆస్పత్రి వద్దకు బస్సు.. డ్రైవర్ సమయస్ఫూర్తి

ఇటీవల కేరళ ఆర్టీసీ (కేఎస్ఆర్‌టీసీ) బస్సులో ఓ మహిళ ఒక్కసారిగా పురిటి నొప్పులు తీవ్రం కావడంతో బస్సు రూట్ చేంజ్ చేసి గర్భిణీని నేరుగా స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన విదితమే.

Update: 2024-06-01 12:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కేరళ ఆర్టీసీ (కేఎస్ఆర్‌టీసీ) బస్సులో ఓ మహిళ ఒక్కసారిగా పురిటి నొప్పులు తీవ్రం కావడంతో బస్సు రూట్ చేంజ్ చేసి గర్భిణీని నేరుగా స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన విదితమే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ సైతం ఇదే సమయస్పూర్తితో వ్యవహరించాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి కోమల‌ అనే‌ మహిళ ధర్మారం గ్రామానికి ప్రయాణించే సమయంలో నంది మేడారం గ్రామం‌ వద్ద బస్సులోనే ఫిట్స్ వచ్చింది. దీంతో బస్సులో ఉన్న వారంతా తీవ్ర ఆందోళన చెందారు.

దీంతో అప్రవత్తమైన బస్సు‌ డ్రైవర్ అదే గ్రామంలోని ప్రాథమిక‌ అరోగ్య కేంద్రానికి బస్సుని తీసుకెళ్లి.. వైద్యం చేయమని అక్కడి ‌సిబ్బందిని అడిగాడు. ఆస్పత్రిలో ఉన్న వైద్య సిబ్బంది వెంటనే బాధితురాలికి చికిత్స అందించారు. ఆ తర్వాత 108 అంబులెన్స్ వాహనంలో మెరుగైన వైద్యం కోసం జగిత్యాలకి తరలించారు. దీంతో డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరుపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News