NSUI: పార్టీ కోసం శ్రమిస్తా.. కార్యకర్తలకు అండగా ఉంటా: ఎన్ఎస్‌యూఐ స్టేట్ చీఫ్ వెంకట స్వామి

తాను క్షేత్రస్థాయి నుంచి పని చేశానని, ఈ పదవి లభించడం అదృష్టంగా భావిస్తున్నానని ఎన్ఎస్‌యూఐ నూతన అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామి అన్నారు.

Update: 2024-08-20 14:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తాను క్షేత్రస్థాయి నుంచి పని చేశానని, ఎన్‌ఎస్‌యూఐ పదవి లభించడం అదృష్టంగా భావిస్తున్నానని నూతన అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామి అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ మహేష్​‌కుమార్ గౌడ్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకట‌స్వామి మాట్లాడుతూ.. తాను ఎన్‌ఎస్‌యూఐ విభాగంలో విద్యార్ధి దశ నుంచే పని చేశానని గుర్తు చేశారు. మన రాష్ట్రం నుంచి 26 మంది పోటీ‌పడగా, 8 మంది ఇంటర్వ్యూ దశకు వెళ్లామని పేర్కొన్నారు. తన వర్క్‌ను గుర్తించి పార్టీ ఈ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. చిన్న కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇందుకు సహకరించిన ఏఐసీసీ అగ్ర నేతలు, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో తనపై ఎన్నో కేసులు పెట్టారని అన్నారు. ఆసక్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేదని అన్నారు. స్వయం‌కృషితో ఈ దశకు చేరుకున్నానని భావోద్వేగానికి లోనయ్యారు.

Tags:    

Similar News