మూసీ రివర్ ఫ్రంట్ తెచ్చిందేవరు? బీఆర్ఎస్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

మూసీ ప్రక్షాళన పై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు.

Update: 2024-10-01 12:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ ప్రక్షాళన పై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లు ఉన్నారని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ సర్కార్ అని, మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్‌ను నిర్ణయించిం జీవో జారీ చేశారని స్పష్టం చేశారు.

మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా? అని నిలదీశారు. 2021లో మూసీ నది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎన్నో సమావేశాలు నిర్వహించారని అన్నారు. మాస్టర్ ప్లాన్‌ను పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారని స్పష్టంచేశారు. మూసీ నిర్వాసితులకు పరిహారంపై కూడా మరో సమావేశంలో కేటీఆర్ చర్చించారని తెలిపారు. నాటి సమావేశాల్లో యుద్ద ప్రాతిపదికన ఆక్రమణలు తొలగించాలని సమావేశాల్లో కేటీఆర్ ఆదేశించారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మూసీలో 8,480 అక్రమ కట్టడాలు ఉన్నాయని లెక్క తేల్చిందని, హద్దుల గుర్తింపుపై సర్వే కూడా పూర్తి చేసిందన్నారు.


Similar News