వేప చెట్టు నుంచి కారుతున్న కల్లు.. తండోపతండాలుగా తరలి వస్తోన్న జనాలు

ఈత చెట్టుకో.. తాటి చెట్టుకో కల్లు రావడం సహజం.. కానీ వేపచెట్టుకు కల్లు ధారలు ధారలుగా కారడం మీరెక్కడయినా చూశారా..? సూర్యాపేట జిల్లాలోని చివ్వేంల మండలంలోని బద్యతండాలో ఈ అద్భుతం జరిగింది.

Update: 2024-09-10 05:08 GMT

దిశ, నల్గొండ బ్యూరో: ఈత చెట్టుకో.. తాటి చెట్టుకో కల్లు రావడం సహజం.. కానీ వేపచెట్టుకు కల్లు ధారలు ధారలుగా కారడం మీరెక్కడయినా చూశారా..? సూర్యాపేట జిల్లాలోని చివ్వేంల మండలంలోని బద్యతండాలో ఈ అద్భుతం జరిగింది.. ఎక్కడా కనపడని వింత కాబట్టే... జనం కూడా దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. చెట్టు పైభాగాన ఉన్నట్టుండి రంధ్రం పడటంతో.. సుమారు 15 రోజులుగా కల్లు ధారలా కారుతోంది. ఇది తెలిసి ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా వేప కల్లు ఆరోగ్యానికి మంచిదని.. అనేక రోగాలు నయమవుతాయని, కళ్ల సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటూ.. కొందరు ఆ కల్లును సీసాల్లో పట్టుకుపోతున్నారు. ఇలాంటి వింత ఘటనను ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెప్పుకుంటున్నారు.


Similar News