శ్వేత పత్రం Vs స్వేద పత్రం.. కాసేపట్లో BRS పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
కాంగ్రెస్ శ్వేత పత్రాలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ స్వేద పత్రం రెడీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ శ్వేత పత్రాలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ స్వేద పత్రం రెడీ చేసింది. తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన అభివృద్ధి, సృష్టించిన సంపదపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ వేదికగా ఉదయం 11 గంటలకు స్వేదపత్రం విడుదలకు చేయనున్నట్లు వెల్లడించారు. రెక్కల కష్టంతో నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోమన్నారు. జరిగిన అభివృద్ధిని వివరించేందుకు తాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాల పేరిట తెలంగాణ అప్పులను ప్రజల ముందుంచిన విషయం తెలిసిందే.