లోక్ సభ ఎన్నికల్లో ‘సెటిలర్స్’ ఎటువైపు? తెలంగాణలో మారుతున్న సమీకరణాలు

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలకమైన సెటిలర్స్ ఓట్లు ఏ పార్టీకి వేయబోతున్నారనేది తాజాగా హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2024-04-07 10:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలకమైన సెటిలర్స్ ఓట్లు ఏ పార్టీకి వేయబోతున్నారనేది తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సృష్టించినా.. హైదరాబాద్‌లో మాత్రం కారు జోరు చూపించింది. ఏపీ ప్రభావం ఉన్న ఖమ్మం, నల్గొండ, మహాబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు మద్దతు తెలిపారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్‌తో పాటు సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు పూర్తి మద్దతు రావడానికి సెటిలర్స్ ఓట్లే కారణమని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

గతంలో బీఆర్ఎస్‌కే జై!

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే జై కొట్టిన సెటిలర్స్.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈక్వేషన్స్ మారనున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో సెటిలర్స్ కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హవా నడుస్తుండటంతో ఈ పార్టీలకే సెటిలర్స్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు ఏపీలో కూడా సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో సెటిలర్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశలు కూడా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది.

తెలంగాణలో జనసేన, టీడీపీ సపోర్ట్? 

ఏపీ సెటిలర్స్ ప్రభావం చూపే తెలుగు దేశం పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసింది. జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసినప్పటికి సెటిలర్స్ మాత్రం బీఆర్ఎస్‌కే మద్దతు ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ, జనసేన పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. పైగా ఏపీలో టీడీపీ, జనసేన బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.. కాబట్టి తెలంగాణలో కూడా ఆ పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబుని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గుడు, మూర్ఖుడు అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. సెటిలర్స్ ఎక్కువగా ఉండే టీడీపీ పార్టీ అధినేతను కేసీఆర్‌ విమర్శించడంతో బీఆర్ఎస్‌పై చూపే అవకాశం ఉంది.

Tags:    

Similar News