ట్యాంక్ బండ్‌లో నిమజ్జనాలకు 2021 హైకోర్టు తీర్పు కొనసాగింపు.. ఇంతకి అప్పటి తీర్పులో కోర్టు ఏమ్ చెప్పిందంటే..?

ట్యాంక్ బండ్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధించాలని, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొనసాగించాలని వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఈ రోజు తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.

Update: 2024-09-10 11:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ట్యాంక్ బండ్‌(tank bund)లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధించాలని, గతంలో హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును కొనసాగించాలని వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఈ రోజు తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అలాగే యధావిధిగా గణేష్‌ నిమజ్జనాలు చేసుకొవచ్చని.. 2021లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలపింది. నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్ వేయడం సరికాదని..హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది. గతంలో ఆదేశాల సమయంలో హైడ్రా లేదని.. ఇప్పుడెలా హైడ్రాను పార్టీగా చేస్తామన్న హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది.

ట్యాంక్ బండ్‌లో నిమజ్జనాలపై 2021 కోర్టు తీర్పు

ట్యాంక్ బండ్(హుస్సేన్ సాగర్)లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన వినాయకుడి విగ్రాహలను నిమజ్జనం చేయకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, GHMC, HMDA, నగర పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సాగర్‌లో నీరు కలుషితం కాకుండదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో కోర్టు స్పష్టంచేసింది. నాటి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎం.ఎస్. రామచంద్ర రావు, టి వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. కాగా హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఓ అడ్వకేట్ దాఖలు చేసిన కాంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

వినాయక చవితి ఉత్సవాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని, అలాంటి విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. పీవోపీ వినాయక విగ్రహాల కారణంగా ట్యాంక్ బండ్ జలాలు మొత్తం కలుషితం కాకుండా సాగర్‌లో ఒక వైపు రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసి.. ఆ పరిధిలో పే విగ్రహాల నిమజ్జనం చేపట్టాలని కోర్టు తెలిపింది. అలాగే నిమజ్జనం అనంతరం సాగర్ అడుగున ఉన్న వ్యర్థాలు, శిథిలాలు తొలగించాలని, ట్యాంక్ బండ్ వైపు నుంచి కాకుండా పీవీ మార్గ్, నెక్లేస్ రోడ్డు, సంజీవయ్య పార్క్ రోడ్డు వైపు నుంచి విగ్రహాల నిమజ్జనానికి చేయాలని తెలిపింది. దూర ప్రాంతాల నుంచి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌కి తీసుకురావొద్దని.. చిన్న సైజు విగ్రహాలను భక్తులు తమ ఇంటి వద్దే నీటి బకిట్లలో నిమజ్జనం చేసుకోవాల్సిందిగా పౌరులకు 2021 తీర్పులో హైకోర్టు విజ్ఞప్తి చేసింది.


Similar News