డ్రోన్లతో డ్రగ్స్..వెపెన్స్.. సరిహద్దులు దాటి వస్తున్న మాదకద్రవ్యాలు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : భారత్–పాక్సరిహద్దుల్లో మన సైన్యానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. పాక్‌ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తరచూ డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలు..మారణాయుధాలను మన దేశంలోకి పంపిస్తుండటం బోర్డర్సెక్యూరిటీ
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : భారత్–పాక్సరిహద్దుల్లో మన సైన్యానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. పాక్‌ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తరచూ డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలు..మారణాయుధాలను మన దేశంలోకి పంపిస్తుండటం బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంత పకడ్భంధీగా నిఘా పెట్టినా ఎక్కడో ఒక చోటు నుంచి దేశం లోపలికి వస్తున్న డ్రగ్స్యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నాయి. ఇక, సరిహద్దుల అవతలి నుంచి స్మగుల్అవుతున్న మారణాయుధాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి చేరి తరచూ బుల్లెట్లు కక్కుతున్నాయి. గత ఒక్క సంవత్సరంలోనే సరిహద్దుల అవతలి నుంచి డ్రోన్ల ద్వారా వచ్చిన డ్రగ్స్‌విలువ రెండువేల అయిదు వందల కోట్ల రూపాయలంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పట్టుబడుతున్న డ్రగ్స్కంటే కనీసం నాలుగు రెట్లు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చేరుతున్నాయని అధికారులే చెబుతున్నారు.
ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా..
పంజాబ్, రాజస్థాన్రాష్ర్టాలకు సంబంధించి పాకిస్తాన్బోర్డర్ఉన్న ప్రాంతాల నుంచే ఎక్కువగా డ్రోన్ల ద్వారా డ్రగ్స్, అధునాతన మారణాయుధాలు మన దేశంలోకి వస్తున్నాయి. పంజాబ్రాష్ర్టంలోని పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, అమృత్ సర్, తర్న్తరేన్, ఫిరోజ్‌పూర్, సజిల్కా, రాజస్థాన్‌లోని గంగాపూర్ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్‌ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా అధికంగా ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
2,200 కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్..
అధికారిక లెక్కల ప్రకారం ఒక్క 2022లోనే బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్సిబ్బంది భారత్–పాక్సరిహద్దుల్లో ఇరవై రెండు డ్రోన్లను కూల్చివేశారు. వీటి నుంచి 317 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు చెబుతున్న ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 2వేల రెండు వందల కోట్లకు పైగానే ఉంటుంది. ఇలా సరిహద్దులు దాటి వస్తున్న ఈ మాదకద్రవ్యాలు దేశం మొత్తం పంపిణీ అవుతున్నట్టు నార్కొటిక్సెల్కు చెందిన ఓ సీనియర్అధికారి చెప్పారు. సెలబ్రిటీలతోపాటు విద్యార్థినీ, విద్యార్థులు, యువతీ, యువకులు వీటికి బానిసలుగా మారి ఇల్లు..ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారన్నారు. కొంతమంది డ్రగ్స్మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్టు వివరించారు.
అసాంఘిక శక్తుల చేతుల్లోకి ఆయుధాలు..
ఇక, డ్రోన్ల ద్వారా మన దేశంలోకి వస్తున్న అత్యాధునిక మారణాయుధాలు మాఫియా డాన్లు, కరడుగట్టిన గ్యాంగ్స్టర్ల చేతుల్లోకి చేరుతున్నాయి. దాంతోపాటు నేర ప్రపంచంలోకి కొత్తగా వస్తున్న వారికి కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఉపయోగిస్తూ మాఫియా డాన్లు, గ్యాంగ్స్టర్లు చేస్తున్న నేరాలకు అంతు లేకుండా పోతోంది. దీనికి నిదర్శనంగా ఉత్తర ప్రదేశ్‌లో హత్యకు గురైన అతీక్ఉదంతాన్నే పేర్కొనవచ్చు. ప్రయాగ్రాజ్సీజేఎం కోర్టులో అతీక్రిమాండ్రిపోర్టును సమర్పించిన పోలీసులు అందులో లష్కర్ఏ తొయిబా సంస్థ డ్రోన్ల ద్వారా అతీక్‌కు అత్యంత అధునాతన ఆయుధాలను సమకూర్చినట్టు పేర్కొనటం గమనార్హం. గత ఏడాది బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్పోలీసులు డ్రోన్లను కూల్చి వేసి డెబ్భయికి పైగా ఏకే 47 తదితర అధునాతన ఆయుధాలు, తొమ్మిది వందల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎక్కువగా చైనా మేడ్...
ఇక, సరిహద్దుల్లో బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్కూలుస్తున్న డ్రోన్లలో చైనా దేశంలో తయారైనవే ఎక్కువగా ఉంటున్నాయి. ఒక్కో డ్రోన్ముప్పయి నుంచి యాభై కిలోల బరువును మోసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటున్నాయి. కొన్నిసార్లు అమెరికా, చైనా దేశాల్లో తయారైన విడిభాగాలను అసెంబుల్చేస్తూ పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్లు తయారు చేసి మన దేశంలోకి డ్రగ్స్, మారణాయుధాలను పంపిస్తున్నారు.