'యూనిఫాం సివిల్ కోడ్ అంశంపై వెనుకడుగు వేయబోము'

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అంశంపై తాము ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగువేయబోమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి స్పష్టం చేసారు.

Update: 2023-07-11 16:59 GMT

దిశ , తెలంగాణ బ్యూరో: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అంశంపై తాము ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగువేయబోమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి స్పష్టం చేసారు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విజన్ లేదని ఎన్నికలు గుర్తుకు వస్తేనే అభివృద్ధి చేస్తామని అంటారు.. ఆపై మళ్ళీ మరిచిపోతారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లోని చిన్న నగరాలు, తక్కువ జనసాంద్రత ఉన్న చోట్ల అధిక బడ్జెట్ కేటాయిస్తున్నారని వాటికంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన హైదరాబాద్‌లో బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.

మంత్రి కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్తున్నారని కానీ పట్టణంలో 20 లక్షల మందికి కూడా తాగు నీరు అందటం లేదని అన్నారు. 2 సెంటిమీటర్ల చిన్న వర్షానికే నాలాలు నిండి రోడ్లపైకి, ఇండ్లలోకి నీరు వస్తున్నాయని.. 30 నుంచి 40 సెంటిమీటర్ల వర్షం పడినా ఏమీ ఇబ్బందులు కలగకుండా చూస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.. మరి ఏమైందని అయన ప్రశ్నించారు. ప్రజలు కట్టిన టాక్స్ డబ్బులతో 30 శాతం నిధులు కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీకి పోతున్నాయని ఆరోపించారు. ఇలా జరిగితే ఇక అభివృద్ధి.. ఎలా సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వాటా ఇవ్వకున్నా యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగిస్తామన్నా ఎందుకు సహకరించలేదని.. మెహిదీపట్నం టు బీహెచ్ఈఎల్ వరకు మెట్రో ఏమైందని ప్రశ్నించారు. వ్యాపార లావాదేవీలపై తప్పితే హైదరాబాద్ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని సర్కార్ కేసీఆర్ దన్నారు . డబుల్ ఇండ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. బీజేపీ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు.


Similar News