అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేస్తాం: సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

సైనిక నియామక ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-01-18 12:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: సైనిక నియామక ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. బీజేపీ ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేసి.. పాతపద్దతిలోనే సైనిక నియామకాలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ సంస్థ అయిన ఎల్‌ఐసీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని.. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ ఏజెంట్లు అంతా ఏకమై.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎల్ఐసీ ఏజెంట్లు సింహాల్లా గర్జించి ఎల్ఐసీని ప్రైవేట్ పరం కాకుండా చూడాలన్నారు. దేశ ప్రజలను కష్టాల నుండి విముక్తి చేయడానికి పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News