భయ్యా సన్నీ యాదవ్‌ను త్వరలో అరెస్టు చేస్తాం: సూర్యాపేట డీఎస్పీ

ఇటీవల బెట్టింగ్ యాప్‌ (Betting app)లలో యువత లక్షల రూపాయలను పొగొట్టుకొని.. అప్పులపాలు కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.

Update: 2025-03-13 06:49 GMT
భయ్యా సన్నీ యాదవ్‌ను త్వరలో అరెస్టు చేస్తాం: సూర్యాపేట డీఎస్పీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల బెట్టింగ్ యాప్‌ (Betting app)లలో యువత లక్షల రూపాయలను పొగొట్టుకొని.. అప్పులపాలు కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ (Promote) చేసేవారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు పై కేసు నమోదు కాగా తాజాగా సూర్యాపేట జిల్లాకు చెందిన బయ్యా సన్నీ యాదవ్ (Bye Sunny Yadav) అనే యూట్యూబర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రభుత్వం రూల్స్ కు వ్యతిరేకంగా యువతను బెట్టింగ్ యాప్‌లను (Betting app) డౌన్ లోడ్ చేసుకొని డబ్బులు గెలుచుకోవచ్చని.. చెప్పినందుకు గాను అతనిపై రెండు రోజుల క్రితం సూర్యాపేట పోలీసులు కేసు నమోదు (Case Registered) చేశారు. కొద్ది రోజుల క్రితం.. భయ్యా సన్నీ యాదవ్ ఓ ఎలక్ట్రానిక్ షాప్ లోకి వెళ్లి.. బైక్ రైడింగ్ కు సంబంధించిన కెమెరాలను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఆ కెమెరాలను కనడానికి బెట్టింగ్ యాప్ లో గెలిచిన డబ్బును ఉపయోగించినట్లు వీడియోను యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్‌లలో పోస్ట్ చేశాడు. కాగా ఆ వీడియో పై స్పందించిన ఐపీఎస్ అధికారి సజ్జనార్ (IPS officer Sajjanar) ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

ఈ క్రమంలో సన్నీ యాదవ్ ఫ్రోఫైల్ ను చెక్ చేసిన పోలీసులు.. అతని ఖాతాలో చాలా వరకు బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ వీడియోలను గుర్తించి కేసు నమోదు (Case Registered) చేశారు. ఇదే విషయంపై మార్చి 13న గురువారం ఉదయం.. సూర్యాపేట జిల్లా డీఎస్పీ (Suryapet District DSP) మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సన్నీ యాదవ్ పై నూతన్ కల్ పీఎస్ లో కేసు నమోదు చేశాము. అతనిపై విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే సన్నీ యాదవ్ ను అరెస్టు చేస్తామని డీఎస్పీ రవి (DSP Ravi) చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై యుద్ధం చేస్తున్న నా అన్వేషణ (Naa Anveshana) అనే యూట్యూబర్తో.. బెట్టింగ్ యాప్ నిర్మూలణపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ (IPS officer Sajjanar) వీడియో కాల్ ద్వారా చర్చించారు. ఈ చర్చ జరిగిన మరుసటి రోజు సన్నీ యాదవ్ పై కేసు నమోదు కావడం విశేషం. కాగా గతంలో వీరిద్దరి మధ్య బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ గురించి పెద్ద యుద్ధమే జరగ్గా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ అంతా ఏకమై నా అన్వేషనా ను వ్యక్తిగతంగా దూషించడం ప్రారంభించి నానా హంగామా సృష్టించారు. అలాంటి వారిపై ఇటీవల కాలంలో ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి.


Similar News