హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: Bandi Sanjay Kumar
ప్రజాసంగ్రామ యాత్ర జరిగితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కుటుంబంపై చర్చ జరుగుతుందనే టీఆర్ఎస్ ఆటంకాలు సృష్టిస్తోందని బండి సంజయ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాసంగ్రామ యాత్ర జరిగితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కుటుంబంపై చర్చ జరుగుతుందనే టీఆర్ఎస్ ఆటంకాలు సృష్టిస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎలాంటి కారణాలు లేకుండానే సభ పర్మిషన్ రద్దు చేశారని తిరిగి తాము హైకోర్టుకు ఆశ్రయించామని అన్నారు. రేపటి సభకు పర్మిషన్ ఇచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. లిక్కర్ స్కామ్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ప్రజాసంగ్రామ యాత్రకు ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు.
సీఎం అనేక రకాల కుట్రలు చేస్తున్నారని, ఎన్ని ఆటంకాలు సృష్టించిన నిర్దేశించుకున్న రీతిలోనే బీజేపీ సభ జరుగుతుందన్నారు. నిర్భందాలు, ఆంక్షలకు నిరసనగా రేపటి సభకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారని చెప్పారు. పోలీసులపై కేసీఆర్ ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు నలిగిపోతున్నారని అన్నారు. తాము చెప్పినట్లుగానే భద్రకాళి టెంపుల్ వద్దకు పాదయాత్ర కొనసాగించేందుకే ప్రత్నం చేస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ముందుకు సాగుతామన్నారు. రేపటి సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్ చెప్పారు.