కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం... హరీష్ రావు

ఫుడ్ పాయిజన్ తో (Food poisoning) ఆసుపత్రి పాలైన వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికలను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులను, మాజీ మంత్రులను అడ్డుకోవడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిష్ రావు (FormerMLA Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-12-12 09:52 GMT

దిశ, వెబ్ డెస్క్; ఫుడ్ పాయిజన్ తో (Food poisoning) ఆసుపత్రి పాలైన వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికలను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులను, మాజీ మంత్రులను అడ్డుకోవడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిష్ రావు (FormerMLA Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎక్స్ వేదికగా ఖండిచారు. తమ పార్టీ నాయకులు సబితా ఇంద్రా రెడ్డి (Sabita Indra Reddy), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) లను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఏడాదికాలంగా గురుకుల వ్యవస్థలు, విద్యావ్యవస్థలు కుప్పకూలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రశ్నించిన ప్రతిపక్షాన్ని అడ్డుకుంటున్నారని, అడిగితే అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సో కాల్డ్ ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ హరిష్ రావు ప్రశ్నించారు.

పసిబిడ్డలకు కనీసం ఆహారం పెట్టలేని అమానవీయ ప్రభుత్వం పాలనను , అరెస్టుల పేరుతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ప్రజా పాలన అంటే ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడమేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తున్న ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం కాకుండా, పసిబిడ్డలకు పోషకాహారం అందించడం, సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టడం మంచిదని కేటీఆర్ సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను పార్టీ నేతలను అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News