TS New Secretariat: ఒక్క రాత్రి వర్షానికే బయటపడ్డ కొత్త సెక్రటేరియట్ డొల్లతనం

ఒక్క రాత్రి కురిసిన వర్షానికే కొత్త సచివాలయం మీడియా సెంటర్‌లో వాటర్ లీక్ అయింది. శ్లాబ్ మీద నుంచి నీరంతా హాల్‌లోకి వచ్చేసింది.

Update: 2023-05-01 06:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక్క రాత్రి కురిసిన వర్షానికే కొత్త సచివాలయం మీడియా సెంటర్‌లో వాటర్ లీక్ అయింది. శ్లాబ్ మీద నుంచి నీరంతా హాల్‌లోకి వచ్చేసింది. పిల్లర్ పగుళ్ళు, దానికి తోడు శ్లాబ్ నుంచి నీరు చెమ్మగా చేరడం మాత్రమే కాక చుక్కలు చుక్కలుగా కారి ఫ్లోర్ మీదకు చేరింది. తొలి రోజు సచివాలయానికి వస్తున్న ఉద్యోగుల ఫీలింగ్ తెలుసుకోడానికి అక్కడికి చేరుకున్న పాత్రికేయులను మీడియా సెంటర్‌లో ఉండడానికి వీలు లేనంతగా ఫ్లోరింగ్ మొత్తం నీటితో తడిచిపోవడం విస్తుపోయేలా చేసింది. కోట్లాది రూపాయల ఖర్చుతో సచివాలయాన్ని కట్టినా మీడియా సెంటర్ విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఫస్ట్ రోజునే పిల్లర్‌కు పగుళ్ళు కనిపించడం గమనార్హం. హడావిడిగా పనులు ముగించాలన్న తొందరలో ఇలా జరిగిందా లేక మీడియా సెంటర్ ఎలా ఉన్నా ఫర్వా లేదనే అలసత్వమా అనే చర్చ మొదలైంది.ఒక్క రాత్రి వర్షానికే బయటపడ్డ కొత్త సెక్రటేరియట్ డొల్లతనం.

అకాల వర్షాలకే మీడియా సెంటర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక తుపాను సమయాల్లో, వర్షాకాలంలో ఇంకెంత ఘోరంగా ఉంటుందోననే గుబులు పట్టుకున్నది. ఎలాగూ సచివాలయం లోపలికి వెళ్ళడానికి మీడియాపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం ప్రాంగణానికి వెలుపలే ఒడ మీడియా సెంటర్‌ను ఏర్పాటుచేసింది. కానీ అందులో ఉండడానికి వీల్లేనంతగా ఫ్లోరింగ్ మీద నేరు చేరిపోవడంతో బైటనే ఉండిపోవాల్సి వచ్చింది.

Tags:    

Similar News