పేరుకే పెద్దాస్పత్రి.. సౌకర్యాలు మాత్రం కరువు...

Update: 2024-08-30 10:51 GMT

దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు కొత్తగూడ గంగారం మండలాల ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న ఆసుపత్రి గూడూరు కమ్యూనిటీ ఆసుపత్రి అన్ని అధునాతన హంగులతో నిర్మించిన.. వైద్య సౌకర్యాలు మాత్రం కరువు. ఆస్పత్రిలో అనేక సమస్యలు వేధిస్తున్నాయి. కొత్తగూడ, గూడూరు, గంగారం ఏజెన్సీ మండలాలు. కాబట్టి నిత్యం వందలాది మంది రోగులు చికిత్స నిమిత్తం గూడూరు ఆసుపత్రికి వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే సమయానికి డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రస్తుతం అనేక సీజనల్ వ్యాధులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు నిత్యం ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతుంది. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని అలాగే ఆసుపత్రికి వచ్చే రోగులకు బెడ్స్ కొరత ఉండటంతో ఒకే బెడ్ పై ఇద్దరికీ వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఆసుపత్రిలో బెడ్స్ కొరత..

గూడూరు కమ్యూనిటీ ఆసుపత్రిలో 30 పడకలు మాత్రమే ఉన్నాయి. గతంలో 100 పడకలగా అప్ గ్రేడ్ చేస్తామని చెప్పినా అధికారులు ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఇది ఏజెన్సీ ప్రాంతం కావడంతో రోజు వందలాదిమంది రోగులు ఆసుపత్రికి వచ్చి ఇన్ పేషంట్ గా అడ్మిట్ అవుతూ ఉండడంతో ఒకే బెడ్ పై ఇద్దరికీ వైద్య సేవలు అందించాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఆసుపత్రిని వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత...

మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది. సుమారు 10 మంది డాక్టర్లు అందుబాటులో ఉండవలసి ఉండగా ప్రస్తుతం 5 గురు డాక్టర్లు మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. వారు కూడా ఓపి సమయములో మాత్రమే అందుబాటులో ఉండి మిగతా సమయంలో ఉండకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాత్రి సమయాలలో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని రోగులు వాపోతున్నారు. ఇప్పటికీ అయినా గూడూరు ఆసుపత్రికి ప్రభుత్వం రెగ్యులర్ డాక్టర్లను నియమించి అన్నివేళలా అందుబాటులో ఉండే విధంగా ఉంచాలని గూడూరు మండల స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

మొరాయిస్తున్న అంబులెన్స్...

ఏదైనా ప్రమాధం జరిగిన లేక అత్యవసరంగా ఏమైనా అనారోగ్య సమస్య వచ్చిన అందుబాటులో ఉండే రక్షించేది అంబులెన్స్ కీలక సమయాలలో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి చేర్చి ప్రాణాలను రక్షిస్తూ ఉంటుంది. అలాంటి అంబులెన్సే మోరాయిస్తే ఏంటి పరిస్థితి.గూడూరు ఆసుపత్రిలో అంబులైన్స్ తరుచూ మొరాయిస్తూ ఉంటుంది. గత నెల రోజుల క్రితం అత్యవసర చికిత్స కోసం ఒక రోగిని వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ మోరాయించింది. 


Similar News