దిశ, పాలకుర్తి, తొర్రూరు: జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆకస్మిక తనిఖీ చేశారు. మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందికి గురికాకుండా వైద్యులు తమదైన శైలిలో వారికి పలు సూచనలు ఇచ్చే విధంగా అందరూ పనిచేయాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. అదేవిధంగా... ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో లేని వైద్యులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిఎంహెచ్ఓ రవీందర్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం హాస్పిటల్ ని తనిఖీ చేసి రిజిస్టర్లు, హాస్పటలోని రోగుల బాగోగులు అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.