శ్రీనివాస కాలనీలో చోరీ...
వరంగల్ నగరంలోని శ్రీనివాస కాలనీలో పట్టపగలే చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి 100 ఫీట్ల రోడ్డులోని శ్రీనివాస కాలనీలో ఎండి యాకూబ్ పాషా అనే వాటర్ ప్యూరిఫై వ్యాపారి నివాసముంటున్నాడు.
దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ నగరంలోని శ్రీనివాస కాలనీలో పట్టపగలే చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి 100 ఫీట్ల రోడ్డులోని శ్రీనివాస కాలనీలో ఎండి యాకూబ్ పాషా అనే వాటర్ ప్యూరిఫై వ్యాపారి నివాసముంటున్నాడు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో తమ భార్య పిల్లలతో సొంత పనుల నిమిత్తం బయటికి వెళ్లారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి తాళం పగలగొట్టి ఉండడం చూసి షాక్ అయ్యారు. ఇంటిలోకి వెళ్లి చూస్తే బీరువా తాళం తీసి బట్టలు చిందరవంధరగా కనిపించాయి. వెంటనే బీరువాలో దాచిపెట్టిన ఐదున్నర తులాల బంగారు నగలు, 500 గ్రాముల వెండి దోచుకెళ్ళినట్లు గుర్తించాడు. దీంతో యాకుబ్ పాషా స్థానిక ఎనుమాముల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు యాకుబ్ పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రాఘవేంద్రర్ తెలిపారు.