ఈ విషయం తెలిస్తే మీరు కూడా ఆ...శ్చర్యపోతారు!

కొంతమంది ప్రముఖులు చూడటానికి సాధారణంగా కనిపిస్తారు.. కానీ, వారి ఆలోచన విధానం...Special story Over Neem Crop

Update: 2023-01-31 05:19 GMT

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది ప్రముఖులు చూడటానికి సాధారణంగా కనిపిస్తారు.. కానీ, వారి ఆలోచన విధానం, వారి భవిష్యత్ చూపు... చివరగా వారి సక్సెస్ స్టోరీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటది. ఇలాంటి కోవకు సంబంధించిన వ్యక్తే జనగామ జిల్లా సిద్ధంకి గ్రామానికి చెందిన ఓ రైతు. అతను అందరిలా కాకుండా భవిష్యత్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్నంగా ఆలోచించి ఇప్పుడుందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అదేమంటే... ఇతర రైతుల మాదిరిగా కొబ్బరి తోటనో, మామిడి తోటనో కాకుండా వేప తోటను పెంచడం ప్రారంభించాడు. అది కూడా ఏకంగా 10 ఎకరాల్లో 5000 మొక్కలను నాటి పెంచుతున్నాడు. దీంతో అంతా మొదటగా షాకయ్యారంటా. ఏంటని ఆయనను అడుగగా ఆయన స్పందిస్తూ... ప్రస్తుతం, భవిష్యత్తులో వేప నూనెకు బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వేప తోటను పెంచుతున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు.. వేప నూనెను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందంటా. దీంతో భారీగా వేపనూనెకు డిమాండ్ ఉండడంతో అతను ఈ వేప చెట్లను పెంచుతున్నట్లు తెలిపాడంటా. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారంటా. 


Similar News