కేసీఆర్​ కుటుంబంపై పరకాల ఎమ్మెల్యే ధ్వజం

తెలంగాణ రాష్ట్రంలోని వనరులను, ప్రభుత్వ భూములను దోచుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని చూసి స్టువర్టుపురం దొంగలు కూడా సిగ్గుపడుతున్నారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-09 13:51 GMT

దిశ,హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలోని వనరులను, ప్రభుత్వ భూములను దోచుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని చూసి స్టువర్టుపురం దొంగలు కూడా సిగ్గుపడుతున్నారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బీరం సునంద సుధాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు హాజరై మాట్లాడారు. వీరికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు బీరం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దామెర క్రాస్ రోడ్డు నుండి ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

    వ్యవసాయ మార్కెట్ కమిటీని ముందుగా ఇద్దరు ఎమ్మెల్యేల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్ పర్సన్ బీరం సునంద సుధాకర్ రెడ్డిని ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్. నాగరాజు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సునంద సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని వనరులను, ప్రభుత్వ భూములను ధరణి సైటును అడ్డుపెట్టుకొని దోచుకున్న దొంగలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నేడు ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ, భూకబ్జాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

     పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నిరుపేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వ నిధులతో రోడ్లు వేసుకున్నాడని దుయ్యబెట్టారు. వాటిని కోట్లాది రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. పార్టీ కోసం పని చేసే నాయకులకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఆత్మకూరు మార్కెట్ ను వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి, జిల్లా అధికారులు, మండలాధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News