కేసీఆర్ తర్వాత నేనే సీనియర్ అంటూ మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-13 05:45 GMT

దిశ పర్వతగిరి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వరంగల్​ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్​ తరువాత తానే సీనియర్​ అంటూ చెప్పుకున్నారు.. ఇంతకీ ఎర్రబెల్లి ఎందుకు అలా అన్నారు? ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు చురుకుగా ఉండే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ వరంగల్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​ తరువాత తానే సీనియర్​ అంటూ చెప్పుకొచ్చారు. గత 30 ఏళ్లుగా వరుస విజయాలతో సీనియర్​ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో నెగ్గుతున్నానని అన్నారు.

వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న 1987-1988 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ రంగంలోనైనా రాణించాలంటే కృషి పట్టుదల అవసరమని తోటి స్నేహితులు, సన్నిహితులకు హితబోధ చేశారు. తాను డాక్టర్ అవ్వాలనుకున్నానని, కానీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. క్రీడల్లోను ఎప్పుడు ముందుండే వాడినని తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీఎం కేసీఆర్​ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు.

వరంగల్​ జిల్లా పర్వతగిరి గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆయన తన తండ్రి పోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన తండ్రి జగన్నాధ రావు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ‘‘మా నాన్నను ఓడించడానికి కాంగ్రెస్ పంతం కట్టి మా నాన్నకు ఓడించారు. అందుకే నేను గతంలో టీడీపీలోకి చేరాను. కాంగ్రెస్ పార్టీని కథం చేయడానికి నేను 2016లో టీఆర్​ఎస్​లోకి వచ్చాను’’ అని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన.. 2019లో సీఎం కేసీఆర్​ రెండో దఫా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. ఎప్పుడూ ఎదో ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచే ఎర్రబెల్లి దయాకర్..​ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో టీడీపీ హయాంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన వంతు ఎంతో కృషి చేశారు.  

Tags:    

Similar News