అయ్యప్ప దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు ప్రారంభం

నర్సంపేట పట్టణంలో అయ్యప్ప దేవాలయంలో నేటి నుండి మండల పూజా మహోత్సవములు ప్రారంభమవుతున్నట్లు ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవ శంకర్ తెలిపారు. మంగళవారం శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో

Update: 2022-11-15 07:55 GMT

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలో అయ్యప్ప దేవాలయంలో నేటి నుండి మండల పూజా మహోత్సవములు ప్రారంభమవుతున్నట్లు ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవ శంకర్ తెలిపారు. మంగళవారం శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాధవ శంకర్ మాట్లాడుతూ... 2000 సంవత్సరంలో మొదటి మండల పూజా మహోత్సవాలను మొదలు పెట్టినట్లు తెలిపారు. నేడు 22వ (ద్వివింశతి) మహోత్సవాలను 16.11.22 నుంచి 27.12.22 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మండల కాలంలో ఎప్పటిలాగానే హైందవ సాంప్రదాయ పద్ధతిలో దివ్య పడిపూజ, పల్లివేట, పంబఆరాట్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు.

మంగళవారం ఉదయాన్నే ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి, సుదర్శన హోమాన్ని చేపట్టారు. శబరిమమలైలో చేస్తున్నట్లు ఒక మండల కాలంలో 5 పడి పూజలు దాతల సహకారంతో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 1200 మంది భక్తులు గుడిలో దీక్ష తీసుకుని భిక్ష తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి రోజు దాదాపు 1000కి పైగా భక్తులు అన్నదానంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ 22వ మండల కాలంలో 80 వేల మందికి అన్నదానం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా, కేరళ వాస్తవ్యులు తాంత్రిక పూజలో నిష్ణాతులైన పద్మనాభన్ నంబూద్రి దివ్య పడిపూజను నిర్వహిస్తారని తెలిపారు.


Similar News