'దిశ' రిపోర్టర్ ను బెదిరించిన ఎస్సై.. వరంగల్ లో ఆడియో కలకలం
'దిశ' రిపోర్టర్ ను బెదిరించిన ఎస్సై.. వరంగల్ లో ఆడియో కలకలం. khanapur SI threatening Disha reporter audio goes viral
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల పోలీస్ స్టేషన్ ఎస్సై తిరుపతి వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. నేను నా ఇష్టమున్నది చేస్తాను... మీరు మాత్రం వార్తలు రాయొద్దన్నట్లుగా ఉంది సారు వ్యవహారశైలి. ఓ వార్త వివరణ కోసం 'దిశ' ఖానాపూర్ విలేకరి బుధవారం ఉదయం ఎస్సై తిరుపతికి కాల్ చేయగా బెదిరింపులకు పాల్పడటం విశేషం. నాపై వార్త రాశావంట కదా..! అదేంటి అది వచ్చి ఉండాలే..! అంటూ వెటకారంగా 'దిశ' విలేకరితో సంభాషిస్తూనే.. మీమీద ఏ వార్త రాయలేదని ఎస్సైకి విలేకరి వివరిస్తున్నా... నువ్వు స్టేషన్‌కు రా.. అంటూ హుకుం జారీ చేయడం గమనార్హం. అకారణంగా 'దిశ' విలేకరిపై ఎస్సై తన ఖాకీ స్వరూపాన్ని మాటల్లో చూపెట్టే ప్రయత్నం చేశారు. అసలు వార్త రాయక ముందే సార్‌కు ఇంత ఉలికిపాటెందుకో అర్థం కావడం లేదు.
అకారణంగా దిశ విలేకరిపై ఎస్సై తన ఖాకీ స్వరూపాన్ని మాటల్లో చూపెట్టే ప్రయత్నం చేశారు. అసలు వార్త రాయక ముందే సార్‌కు ఇంత ఉలికిపాటెందుకో అర్థం కావడం లేదు. వార్తా కథనం ప్రచురించకముందే ఇలా చిరుబురులాడటం ఎస్సైలోని అపరిపక్వతను, మానసిక ఆందోళనను బహిర్గతం చేస్తోందన్న విమర్శలు జర్నలిస్టు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఖానాపూర్‌ను ఎస్సై రాచరికపు పోకడకు ఉన్నతాధికారులు వదిలేశారా..? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఎస్సై వ్యవహారశైలిపై ఎంక్వయిరీ చేయించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు.