లేడీ డాక్టర్లకు టాయిలెట్స్ కూడా లేవు.. ఎంజీఎంలో జూనియర్ డాక్టర్ల నిరసన

Update: 2024-08-14 15:52 GMT

దిశ, వరంగల్ : వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ పై జరిగిన హత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంజీఎం జూనియర్ వైద్యులు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గాంధీ విగ్రహం వద్ద జూనియర్ వైద్యులు పశ్చిమబెంగాల్ ఘటనను ఖండిస్తూ బుధవారం ఆందోళన చేపట్టారు. దేశంలో జూనియర్ వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని వైద్య కళాశాలలో డ్యూటీ ముగించుకొని రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో హత్య హేయమైన చర్య అన్నారు. కాకతీయ వైద్య కళాశాలలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని, కనీసం లేడీస్ కు టాయిలెట్స్ కూడా లేని దుస్థితిలో ఉన్నాయని, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం డాక్టర్ అత్యాచారం, హత్యపై స్పందించకపోవడం బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వం మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని చెప్పారు. 

Tags:    

Similar News