చిత్తశుద్ది ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి ఓట్లు అడగండి : ఈటల
జిల్లాలోని హరిత కాకతీయ లో జిల్లాలోని కాలేజీల, ప్రైవేట్
దిశ, కేయూ క్యాంపస్ : జిల్లాలోని హరిత కాకతీయ లో జిల్లాలోని కాలేజీల, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వానికి టీచర్ల, నిరుద్యోగుల, కాలేజీల, స్కూల్స్ సమస్యలు గుర్తుకు వస్తాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రూ 7500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు ఉన్నాయి. వాటిని చెల్లించే నిజాయితీ ఉందా అన్నారు. లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా, కేవలం కాంట్రాక్టర్స్ కి బిల్లులు చెల్లించడం ప్రియారిటీనా అన్నారు. చిత్తశుద్ది ఉంటే బకాయిలు చెల్లించి ఓట్లు అడగండి. నిరుద్యోగులకు నెలకు రూ 4000 భృతి ఇస్తామని ప్రియాంకా గాంధీతో చెప్పించారు కదా, 6 నెలలైనా నిరుద్యోగుల భృతి ఊసే లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 4డి ఏ లు పెండింగ్ లో ఉన్నాయి. 2023 జూలై లో కొత్త పీఆర్సీ రావాలి, కానీ ఇప్పటివరకు జోషి కమిటీ రిపోర్ట్ గురించే పట్టించుకోవడం లేదన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది కాబట్టే బండకేసి కొట్టారు. మీకు కూడా ఇది తప్పదు. అధికార పార్టీ వారిని గెలిపిస్తే పిల్లి లెక్కనే ఉంటారు. అందరూ నాలాగే కొట్లాడే వారు ఉండరు. అందుకే ప్రశ్నించే గొంతు ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ గా గెలిపించండని కోరారు. గ్రాడ్యుయేట్లు ప్రతి ఒక్కరు మీ ఓటును నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు వేయండి. మీకు హామీ ఇస్తున్నా మీకు అండగా ఉంటాం. మీకు సమస్య వస్తే వాలిపోతామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, రావు పద్మ, జనార్ధన్ రెడ్డి, కాలేజీల, ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు.