రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్

రైతులను రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డోర్నకల్ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ అన్నారు.

Update: 2024-11-20 14:54 GMT

దిశ,నర్సింహులపేట: రైతులను రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డోర్నకల్ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ అన్నారు. బుధవారం మండలంలోని వంతడుపుల, ముంగిమడుగు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు రైతులకు మేలు చేస్తాయని,500 రూపాయలు క్వింటకు బోనస్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ వినయ్ కుమార్,విద్యుత్ ఏఈ పాండు,తహశీల్దార్ నాగరాజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ ,పీఎసీఎస్ చైర్మన్ రాము,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్, ఇర్రిలింగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ నేత చిర్ర సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News