ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అందించాలి

ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.

Update: 2025-01-15 11:19 GMT
ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అందించాలి
  • whatsapp icon

దిశ, మహబూబాబాద్ టౌన్ : ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్స్, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో (రెవెన్యూ) కె. వీరబ్రహ్మచారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడానికి జిల్లా యంత్రాంగం, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు.

     ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించినట్టు చెప్పారు. నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని, అందుకోసం ప్రత్యేకంగా అన్ని విభాగాలతో కలిపి ఒక బృందంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, కృష్ణవేణి, డీసీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, సీపీఓ సుబ్బారావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, డీఏఓ విజయనిర్మల, డీవీహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, డీపీఓ హరిప్రసాద్, గ్రౌండ్ వాటర్ డీడీ సురేష్, డీహెచ్ ఓ మరియన్న, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News