రిపబ్లిక్ డే రోజున రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం

గణతంత్ర దినోత్సవం(Republic Day) రోజున రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ శివారు(Warangal Suburb)లోని మామునూరు(Mamunuru) వద్ద ఆటోలపై లారీ బోల్తా పడింది.

Update: 2025-01-26 06:39 GMT
రిపబ్లిక్ డే రోజున రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం(Republic Day) రోజున రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ శివారు(Warangal Suburb)లోని మామునూరు(Mamunuru) వద్ద ఆటోలపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోల్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. లారీ(Lorry Accident) బోల్తా పడటానికి ఓవర్ లోడ్(Over load) కారణమని నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News