Telangana Floods : వరంగల్‌లో వరద బీభత్సం.. అంధకారంలో హన్మకొండ, వరంగల్ పట్టణాలు

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్‌లో వర్షం బీభత్సం సృష్టింస్తుంది.

Update: 2023-07-27 02:57 GMT

దిశ, వరంగల్ బ్యూరో: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్‌లో వర్షం బీభత్సం సృష్టింస్తుంది. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా హన్మకొండలో 50కి పైగా కాలనీలు నీట మునిగాయి. అలాగే ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు వరద ప్రవహిస్తుంది. భారీ వరద వచ్చి చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలాశయాలను తలపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉమ్మడి జిల్లాలోని హన్మకొండ, వరంగల్ పట్టణాలు అంధకారంలో ఉన్నాయి. అలాగే ములుగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పసర - తాడ్వాయి మధ్యలో వాగు వద్ద రోడ్డు‌కు గండి పడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచపోయాయి.

Read More:  ప్రమాదపుటంచున రామడుగు, గుండి వంతెన..? 

Tags:    

Similar News