దిశ ఎఫెక్ట్ : లీకేజీ గుంతలు పూడ్చిన అధికారులు

మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాటర్ మెయిన్ లైన్ పైపుల లీకేజీల కోసం తీసిన గుంతలు రిపేర్లు చేయకుండా,

Update: 2024-11-19 12:02 GMT

దిశ, మంగపేట : మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాటర్ మెయిన్ లైన్ పైపుల లీకేజీల కోసం తీసిన గుంతలు రిపేర్లు చేయకుండా, పూడ్చకపోవడంతో సోమవారం దిశలో ‘లీకేజీ గుంతలు పూడ్చేదెప్పుడు ’ అనే శీర్షికన వచ్చిన వార్తకు స్పందించిన పంచాయతీ అధికారులు మంగళవారం పైపుల లీకేజీలకు రిపేర్లు చేసి గుంతలు పూడ్చారు. రెండు నెలలుగా నల్లాల్లో మురికినీరు ప్రవహించి రోగాల బారిన పడుతూ ఇబ్బందులు పడ్డ టీచర్స్ కాలనీ వాసులు దిశలో వచ్చిన వార్తతో అధికారులు పైపుల లీకేజీలకు రిపేర్లు చేసి గుంతలు పూడ్చడంతో దిశకు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.


Similar News