బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత మాటలు నమ్మొద్దు : ఝాన్సీ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వారి
దిశ,పాలకుర్తి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక,సామాజిక భద్రత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.పాలకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీకి ఆ పార్టీ నాయకులు ఝలక్ ఇస్తున్నారు.భారీ సంఖ్యలో నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారంపాలకుర్తి మండలంలోని పాలకుర్తి,దర్ధపల్లి,వావిలాల,సిరిసన్న గూడెం,బిక్య తండ పలు గ్రామాలకు చెందిన సుమారు 400 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి ఝాన్సీ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ గూటికి చేరారు.నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి వారికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఓటమి తప్పదని హెచ్చరించారు.ఓటమి తప్పదని నిర్ణయించుకున్న మంత్రి ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పై అక్రమ కేసులు పెట్టి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని అలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని కార్యకర్తలకు అండగా నేను ఉంటానని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పరిపాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.