ధరల పట్టిక ఏర్పాటు చేయాలి

Update: 2024-08-30 13:38 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్ః జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి. మురళీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో మూడు బృందాలుగా ఏర్పడి ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ లో సీజనల్ వ్యాధులు, కీటక జనత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా సంబందిత కేసులు ఆసుపత్రిలలో నమోదు జరిగితే అట్టి వివరాలను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయములో తప్పని సరిగా సమాచారం అంధించాలని జిల్లా ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. రక్త పరీక్షలు మరియు ఆసుపత్రులలో, పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను, స్థానిక భాషలో ఆసుపత్రి ఆవరణలో అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు. హాస్పిటల్స్ కి వస్తున్న డాక్టర్ల కన్సల్టేషన్ వివరాలను అందరికీ కనపడే విధంగా సూచిక బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ లేని వారికి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం, చట్టరీత్యా చర్య తీసుకుంటామన్నారు. ఈ రోజు జిల్లాలోని 14 ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేయడం జరిగిందని ఇందులో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ నిబందనలను ఉల్లంగించిన వాటిని గుర్తించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జి మురళీధర్, డిప్యూటీ డిఎంహెచ్వోప్రమీల , ప్రోగ్రాం అదికారులు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కె. ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్స్ కె.వి రాజు,గీత, సబ్ యూనిట్ ఆఫీసర్స్ రామకృష్ణ, వడ్డెబోయిన శ్రీనివాస్, ఇన్ చార్జ్ డి పిహెచ్ఎన్ఓ మంగమ్మ , అరుణ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.


Similar News