దిశ ఎఫెక్ట్.. ఇసుక అక్రమ రవాణాపై కొరడా జూలిపించిన పోలీస్ శాఖ..
డోర్నకల్ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో ఇసుక అక్రమ
దిశ, మరిపెడ : డోర్నకల్ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో ఇసుక అక్రమ రవాణాపై దిశ పత్రికలో వరుస కథనాలు రావడంతో పోలీస్ శాఖ వారు అక్రమ ఇసుక రవాణాపై కొరడా జులిపించారు. మరిపెడ,నర్సింహులపేట,చిన్నగూడూరు మండలాల్లోని ఇసుక ర్యాంపులకు వెళ్లే దారిలో జెసిబిల సహాయంతో కందకాలు తవ్వారు. ఒక్కొక్క రాంప్ లో రెండు రెండు చోట్ల కందకాలు తీయడం విశేషం.సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉందని వివిధ మండలాలకు చెందిన ప్రజలు ,ప్రకృతి ప్రేమికులు, మేధావులు అంటున్నారు.
దిశ మీడియాలో వస్తున్న వరుస కథనాలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా..?
ఇసుక అక్రమ రవాణా పై వస్తున్న కథనాలకు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఎంక్వయిరీ చేసినట్లు సమాచారం. అసలు ఒక్కొక్క మండలం లో ఒక్కొక్క గ్రామంలో ఎన్ని ఇసుక ట్రాక్టర్లు ఉన్నాయి అవి ఏ ఏ ర్యాంప్ నుంచి నడుస్తున్నాయి వారికి ఎవరు ఎవరు సహకరిస్తున్నారు అంటూ ఈ ఇసుక దందా చేసే ట్రాక్టర్ ఓనర్ల పేరుతో సహా ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.