అంగరంగ వైభవంగా ఐనవోలు మల్లన్న జాతర

మకర సంక్రాంతి మరియు ఆదివారం పురస్కరించుకుని అయినవోలు మల్లికార్జున స్వామివారి ఆలయంలో...Devotees Crowd at Inavolu Mallanna Temple

Update: 2023-01-15 07:49 GMT

దిశ, ఐనవోలు: మకర సంక్రాంతి మరియు ఆదివారం పురస్కరించుకుని అయినవోలు మల్లికార్జున స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, విగ్నేశ్వర పూజలు, స్వామివారికి దేవరులకు నూతన పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకరించారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనానికి సమయం ఐదు గంటల నుండి 6 గంటల సమయం పడుతుంది. భక్తులు మల్లన్నకు బోనాలు, పట్నాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా రాత్రికి రథోత్సవం, పెద్ద బండి మరియు ఎడ్లబండ్ల ప్రదర్శన ఉండనుంది. జాతరను చూడడానికి చాలామంది భక్తులు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ మరియు శాఖలవారు పర్యవేక్షణలో పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వాహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. ఈరోజు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరుకానున్నట్టు ఈవో తెలిపారు. ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉంది. 


Similar News