దిశ, హనుమకొండ : హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శుక్రవారం పరిశీలించారు. కాళోజీ కళాక్షేత్రంలో ఆడిటోరియం, పెయింటింగ్, టైల్స్, ఎలక్ట్రికల్, ఆర్ట్ గ్యాలరీ, ప్లంబింగ్, తదితర అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా అదనపు పనులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, కుడా అధికారులు అజిత్ రెడ్డి, భీమ్ రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.