దిశ, తొర్రూరు: సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయాన్నిసమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ కె. శశాంక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, సిబ్బంది వివరాలు వార్డెన్ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్ పనులను, కిచెన్ షెడ్ ను పరిశీలించారు. కిచెన్ షెడ్ లో వంట కోసం కట్టెలు ఉండడాన్ని గమనించిన వంటకు కట్టెలు వాడవద్దని, గ్యాస్ పొయ్యిని వాడాలని, అవసరమైతే గ్యాస్, పొయ్యిని అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను, మెనును అడిగి తెలుసుకున్నారు. ప్రాంగణంలో మొక్కలు క్రమ పద్ధతిలో పెంచాలని తెలిపారు. ప్రభుత్వంచే మంజూరైన ఇంటిగ్రేటెడ్ నిధులను వాడుకొని సౌకర్యాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహంలో సరిపడా వెలుతురు లేనందున వెంటనే ఉన్న ట్యూబ్ లైట్లు మరికొన్ని అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బయటి వ్యక్తులను హాస్టల్లోనికి అనుమతించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీఓ రమేష్ బాబు, వార్డెన్ జి.కే. శ్రీనివాస్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ డీఈ రవీందర్, ఏఈ సుధాకర్, ఏఎస్ డబ్ల్యూఓ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.