హేమాచలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. లోయలో పడ్డ కారు..

మండలంలోని శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి దర్శణానికి వెళ్తున్న భక్తుల కారు ఘాట్ రోడ్డులో గుట్ట పైకి వెల్తుండగా లోయలో పడింది.

Update: 2025-01-15 07:34 GMT
హేమాచలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. లోయలో పడ్డ కారు..
  • whatsapp icon

దిశ, మంగపేట : మండలంలోని శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి దర్శణానికి వెళ్తున్న భక్తుల కారు ఘాట్ రోడ్డులో గుట్ట పైకి వెల్తుండగా లోయలో పడింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సింగరేణి ఉద్యోగి దోసపాటి కిషోర్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హేమాచల లక్ష్మీనృసింహుని దర్శనానికి వెళుతున్నారు. ఘాట్ రోడ్డులో పైకి ఎక్కుతున్న క్రమంలో కారు ఒక్కసారిగా వెనక్కి వెళ్లి లోయలో పడింది. ఈ ఘటనలో కిషోర్ దంపతులకు స్వల్ప గాయాలు కాగా తోటి ప్రయాణికులు వారిని రక్షించారు. పక్కనే పెద్ద లోయలోకి పోకుండా చెట్టును తట్టుకుని ఆగిపోవడంతో వారు ప్రాణాపాయం నుండి బయటపడినట్లు తెలిపారు.


Similar News