మనోళ్లేనా..? మామూల్లేనా..?

ఇసుక దోపిడీకి పాల్పడుతున్న అక్రమార్కులపై కొరడా ఝలిపించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు గుసగుసలాడుతున్నారు

Update: 2024-12-28 11:48 GMT

దిశ,డోర్నకల్(సీరోల్) : ఇసుక దోపిడీకి పాల్పడుతున్న అక్రమార్కులపై కొరడా ఝలిపించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు గుసగుసలాడుతున్నారు. కొద్ది రోజులుగా పత్రికలో వరుస కథనాలు వెలువడుతున్న అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. రాత్రింబగళ్లు ఇసుక దోపిడీకి అక్రమార్కులు పాల్పడుతున్న క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కరువైందని పౌరులు వాపోతున్నారు. మనోళ్లేనా..? మామూల్లేనా..? అని చర్చ జరుగుతుంది. వ్యవసాయ క్షేత్రాల్లో ఇసుక నిల్వలను గుర్తించి స్వాధీనం పంచుకోవాలని కోరుతున్నారు. సహజ సంపదను కాపాడవలసిందిగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పోలీసుల సహకారంతో అరికడతాం - సీరోల్ తహసీల్దార్ శారద

స్థానిక పోలీసుల సహకారంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయుటకు చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్, ఇరిగేషన్ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. తమ సిబ్బందిని పంపించుటకు సిద్ధంగా ఉన్నప్పటికీ పోలీసులు సహకారం అందవలసి ఉంది.

అక్రమ రవాణా అరికట్టుటకు సహకరిస్తాం - సీఐ రాజేష్

తమ పరిధిలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టుటకు రెవెన్యూ శాఖకు 100% సహకరిస్తాం. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లినప్పుడు తమకు సమాచారం ఇస్తే సిబ్బంది వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారు.


Similar News