జనసంద్రంగా మారిన ఐనవోలు..

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు మల్లన్నను దర్శించుకోవడావడాని శనివారం ఉదయం నుంచి భక్తుల తాకిడి ఏక్కువైంది. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా భక్తులు రాకపోకలు అంతంత మాత్రంగానే ఉందని ఈ ఏడాది మకర సంక్రాంతి ఒక్కరోజే 5 లక్షల పై చిలుకు మల్లన్నను దర్శనానికి వచ్చినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.

Update: 2023-01-16 04:01 GMT

దిశ, వర్ధన్నపేట/ఐనవోలు: మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు మల్లన్నను దర్శించుకోవడావడాని శనివారం ఉదయం నుంచి భక్తుల తాకిడి ఏక్కువైంది. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా భక్తులు రాకపోకలు అంతంత మాత్రంగానే ఉందని ఈ ఏడాది మకర సంక్రాంతి ఒక్కరోజే 5 లక్షల పై చిలుకు మల్లన్నను దర్శనానికి వచ్చినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మల్లన్నను దర్శించుకున్నారు. ఒగ్గు పూజారులచే డప్పు వాయిద్యాలతో శివసత్తులతో పూనకాలతో ఆలయం ప్రాంగణం మార్మోగింది.

భక్తులు తాము కోరుకున్న కోరికలు తీర్చుకోవడానికి నైవేద్యం సమర్పించి పసుపు బండారితో ఒగ్గు పూజారులచే పట్నాలు వేసి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 16 డిపార్ట్ మెంట్లతో కూడిన అధికారులు భక్తులకు సేవలందిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వర్ రావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చుట్టూ పక్కల 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 300 మంది పోలిసు సిబ్బందితో భక్తులకు సేవలందించారు.

రంగు రంగుల పూలతో ప్రభ బండి అలంకరణ

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర లో ముఖ్యమైన ఘట్టం మార్నేని వంశస్థుల ప్రభ బండి రంగు రంగుల పూలతో అలంకరణ అయి డప్పు చప్పుళ్లు డిజె పాటలతో హనుమాన్ గుడి నుండి రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. గత వంద సంవత్సరాల నుండి మార్నేని వంశస్థుల ఇంటి వద్ద నుంచి రంగు రంగుల పూలతో అలంకరించి గ్రామంలోని పురవీధుల్లో ఊరేగిస్తూ ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఈ ప్రభ బండి ఊరేగింపు‌లో డీసీసీబీ మార్నేని రవీందర్ రావు, మార్నేని వంశస్థులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలిసు బందోబస్తు నడుమ ఊరేగింపును కొనసాగింది. ఈ యొక్క ఊరేగింపు చూడటానికి రాత్రి సమయంలో యువకులు చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఐనవోలుకు చేరుకోని ఊరేగింపులో పాల్గొన్నారు.

మల్లన్న సన్నిధిలో పారిశుద్ధ్య లోపం..

శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల పారిశుధ్యం లోపించి భక్తులకు ఇబ్బందికరంగా మారింది. చెత్త చెదారం పేరుకుపోయి దోమల బెడదతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పదహారు డిపార్ట్మెంట్ లతో కూడిన అధికార బృందం పనిచేస్తుందని ఆలయ అధికారులు చెబుతున్నప్పటికీ ఆలయ ప్రాంగణంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండటం భక్తులకు ఇబ్బంది కలగడం గమనార్హం.

ఒక కొబ్బరి కాయ యాభై రూపాయలు

మల్లన్న జాతరకు లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు తాము మొక్కులను కొబ్బరి కాయ కొట్టి కోరికలు కోరుకుంటారు. ఇదే అదునుగా భావించిన సదరు కాంట్రాక్టర్ ఒక్క కోబ్బరి కాయ యాభై రుపాయలకు అమ్ముతూ.. భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదేమిటని భక్తులు ప్రశ్నిస్తే నీ ఇష్టం ఉంటే కోను లేకపోతే లేదు అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. భక్తులకు కొబ్బరి కాయను యాభై రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం ఇష్టం లేకున్న మొక్కును తీర్చుకోవడానికి కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన సదరు కాంట్రాక్టర్ ఆలయ అధికారులతో కుమ్మక్కై ఒక్క కొబ్బరి కాయపై 20 నుంచి 30 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ.. భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు. ఆలయ అధికారులపై సదరు కాంట్రాక్టర్ పై మల్లన్న భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Tags:    

Similar News