బొద్దుగొండలో ఆధునిక పద్దతులపై వ్యవసాయ ప్రదర్శన

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ గ్రామం లోని రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల RAWEP విద్యార్థుల ఆధ్వర్యంలో

Update: 2023-04-28 12:31 GMT

దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ గ్రామం లోని రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల RAWEP విద్యార్థుల ఆధ్వర్యంలో రైతు సదస్సు మరియు ప్రదర్శన నిర్వహించారు. మొదటగా విద్యార్థులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ప్రదర్శన ద్వారా బిందు సేద్యం, సమగ్ర వ్యవసాయం, వరిలో వెదజల్లే పద్ధతి పుట్టగొడుగుల పెంపకం మరియు వివిధ పంటలలో కొత్త రకాల ప్రదర్శన గురించి రైతులకు వివరించారు ఈ రైతు సదస్సులో ముఖ్య అతిథిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి వారు మాట్లాడుతూ రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే విద్యార్థుల ప్రదర్శించిన కొన్ని పద్ధతులు పాటిస్తూ, సమగ్ర వ్యవసాయ విధానలైన పశువులు, కోళ్ల పెంపకం ద్వారా రెట్టింపు ఆదాయాన్ని పొందుతారని అన్నారు ఈ కార్యక్రమంలో కేవికే మల్యాల ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాలతి , జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్, సూర్య నారాయణ , గూడూరు మండల వ్యవసాయ అధికారి అల్లె రాకేష్ గారు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.


Similar News