భారీగా తరలివచ్చిన వీఆర్ఏలు.. అదుపుచేయలేకపోయిన పోలీసులు
పే స్కేల్ అమలు చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, సీనియర్ ఏఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి, కారుణ్య నియామకాలను అమలు
దిశ, ముషీరాబాద్: పే స్కేల్ అమలు చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, సీనియర్ ఏఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి, కారుణ్య నియామకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారి చేసింది. చలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వీఆర్ఏలు అసెంబ్లీకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున వీఆర్ఏలు తరలిరావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. నేపథ్యంలో వీఆర్ఏలకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులను తోసుకుంటూ వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద చౌరస్తాలో బైఠాయించారు. అదే సమయంలో మరి కొంతమంది వీఆర్ఏలు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి అసెంబ్లీ వైపు ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వీఆర్ఏలు అంబేద్కర్ విగ్రహం చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వీఆర్ఏలను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
Also Read : 'వీఆర్ఏలది అర్థంలేని ఆందోళనైతే.. నీది నరంలేని నాలుకా?'
కృష్ణం రాజు చివరి క్షణల్లో పక్కనే ఉన్న స్టార్ హీరోయిన్ అనుష్క ?