Viral: ఏజెంట్ మోసం చేశాడు.. కాపాడండి.. ఇరాక్‌లో జగిత్యాల యువకుడి ఆవేదన

తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఇరాక్ లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నాడు.

Update: 2024-10-08 07:06 GMT

దిశ, డైనమిక్/ జగిత్యాల ప్రతినిధి: తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఇరాక్ లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆ యువకుడి ఆవేదనకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగిత్యాల జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు ఉపాధి కోసం ఇరాక్ దేశానికి వెళ్లాడు. అధిక వేతనం ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి, అతనికి రూ.2.70 లక్షలు ఇచ్చానని చెప్పాడు. ఇక్కడికి వచ్చాక ఏజెంట్ తనని మోసం చేసి, పాస్ పోర్ట్ తీసుకొని ఒక గదిలో బందించి వెళ్లాడని తెలిపాడు. తినడానికి తిండి కూడ లేదని, రోజుకు ఒక పూట మాత్రమే తింటున్నానని, అది కూడా లేకపోతే పస్తులు ఉంటున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ ఉండలేక పోతున్నానని, తనని ఎలాగైనా స్వదేశానికి తీసుకొని వెళ్లాలని వేడుకుంటున్నాడు. దీనిని సెల్ఫీ వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించి.. ఆ యువకుడిని ఇండియా తీసుకొని రావాలని నెటిజన్లు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహా పలువురిని ట్యాగ్ చేస్తున్నారు. అంతేగాక ప్రభుత్వం చొరవ చూపి తమ కుమారుడిని స్వదేశానికి తీసుకురావాలని బాధితుడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.


Similar News