స్టేట్ లోగో మార్చిన రేవంత్ సర్కార్.. BRS మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన నిర్ణయం..!
రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్పు వ్యవహారం స్టేట్ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. రాష్ట్ర అధికారిక లోగోను మారుస్తూ కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్పు వ్యవహారం స్టేట్ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. రాష్ట్ర అధికారిక లోగోను మారుస్తూ కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే లోగోను మార్చాలన్న స్టేట్ గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా వరంగల్ జిల్లాలోని ఖిలా వరంగల్‌లో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ తీసేయడానికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే హక్కే లేదని సీరియస్ అయ్యారు. అసలు కాకతీయుల చరిత్ర ఎంటో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. రాజముద్రలోని చార్మినార్ ప్రజల సంక్షేమానికి చిహ్నామని అన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నాంలో మార్పులపై కోర్టులో కేసు వేస్తానని వినోద్ కుమార్ తెలిపారు. కాగా, స్టేట్ అఫిషియల్ లోగోలో ఇప్పటికే మార్పులు చేపట్టిన తెలంగాణ సర్కార్.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండవ తేదీన ఆవిష్కరణకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో లోగో మార్పులపై కేసు వేస్తానని బీఆర్ఎస్ మాజీ ఎంపీ అనడం హాట్ టాపిక్‌గా మారింది.