కవితకు సీబీఐ నోటీసులపై విజయశాంతి రియాక్షన్ ఇదే!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందా లేదా అనేది ఏజెన్సీలే తెలుస్తాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈడీ, సీబీఐ ఇప్పటి వరకు తేల్చింది గోరంత అ

Update: 2022-12-03 12:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందా లేదా అనేది ఏజెన్సీలే తెలుస్తాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈడీ, సీబీఐ ఇప్పటి వరకు తేల్చింది గోరంత అని ఇంకా బయటకు రావాల్సింది కొండంత ఉందన్నారు. తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదని, ఏజెన్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే సరిపోతుందన్నారు. ఎలాంటి తప్పు చేయకుంటే జనాలను పెట్టుకుని ఇంత హంగామా సృష్టిస్తున్నారని విజయశాంతి ప్రశ్నించారు.

తప్పు చేయని వారు సైలెంట్ గా ఉంటారని తప్పు చేసిన వారే ఎక్కువ మాట్లాడతారని వీళ్లు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే తప్పు చేశారని భావించాల్సి ఉంటుందన్నారు. ఎనిమిదేళ్లుగా లేని దాడులు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు పాపం పండింది కాబట్టే దర్యాప్తు సంస్థలు వచ్చాయన్నారు. ఇన్నాళ్లు ఇన్వెస్టిగేషన్ చేసిన ఏజెన్సీలు ఇక వాళ్ల డ్యూటీ వాళ్లు మొదలు పెట్టారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి లిక్కర్ స్కాం వరకే పరిమితం కాలేదని యావత్ తెలంగాణ సంపదనంతా టీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని అందరిపై తనిఖీలు జరగాలన్నారు. ఎవరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ కామెంట్స్ చేశారు.

Tags:    

Similar News