బస్సుపై నిలబడి ఎమ్మెల్యే ప్రయాణం.. విద్యుత్ వైర్లకు తగిలితే అంతే సంగతి (వీడియో)

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Meeting) నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వరంగల్ జిల్లా (Warangal District) ఎల్కతుర్తి (Elkathurthy) లో భారీ ఏర్పాట్లను చేశారు.

Update: 2025-04-27 09:14 GMT
బస్సుపై నిలబడి ఎమ్మెల్యే ప్రయాణం.. విద్యుత్ వైర్లకు తగిలితే అంతే సంగతి (వీడియో)
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Meeting) నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వరంగల్ జిల్లా (Warangal District) ఎల్కతుర్తి (Elkathurthy) లో భారీ ఏర్పాట్లను చేశారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వరంగల్ బయలుదేరారు. ఇందులో భాగంగా కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన గంగుల కమలాకర్ (Gangula Kamalakar) తన కార్యకర్తలతో కలిసి పయనం అయ్యారు ఈ మేరకు కేబుల్ బ్రిడ్జి వద్ద బస్సు టాప్ పై కార్యకర్తలతో నిల్చోని ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీడియో పై నెటిజన్లు ఫైర్ (Netizens are on fire) అవుతున్నారు.

బాధ్యతగల ఎమ్మెల్యే (MLA) స్థానంలో ఉండి పార్టీ కార్యకర్తలను ప్రమాదకర స్థాయిలో ప్రయాణం చేపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే మరికొందరు. మార్గమధ్యంలో కరెంట్ వైర్లు సైతం ఉంటాయి అవి అంటుకుంటే బస్సుపై ఉన్న వారి పరిస్థితి ఏంటని మండి పడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఆర్టీసీ బస్సు (RTC bus)పై గంగుల ప్రమాదకర ప్రయాణం చేయడంపై.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేక లైట్ తీసుకుంటారా అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి.. బీఆర్ఎస్ 25 సంవత్సరాల వెడుకలకు ఇలా.. సామాన్య కార్యకర్తల ప్రాణాలు పణంగా పెట్టి ఇలా తరలించడం ఎంతవరకు సమంజసం అని ఆ పార్టీ నేతలు తేల్చుకోవాలని సూచిస్తున్నారు.

Full View

Similar News